బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పరిస్థితి విషమించడంతో శివ మృతి చెందాడు. అప్పటికే అతని భార్య ప్రసవ నొప్పులు భరిస్తోంది. అనంతరం వైద్యులు ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడంతో… మగబిడ్డ జన్మించాడు. తండ్రి కన్నుమూసిన తర్వాత బిడ్డ జన్మించడంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శివపై ఆధారపడిన అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరుల్ని కలిచి వేసింది.
Home Andhra Pradesh కర్నూలు ఆస్పత్రిలో విషాదం, తండ్రి కన్నుమూసిన గంటకు బిడ్డకు జన్మనిచ్చిన తల్లి-tragedy in kurnool hospital...