న్యూజిలాండ్‌తో పుణె వేదికగా గురువారం (అక్టోబరు 24) ప్రారంభమైన రెండో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు. తొలి టెస్టులో ఫెయిలైన కేఎల్ రాహుల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై వేటు వేసి.. వారి స్థానాల్లో శుభమన్ గిల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్