మొలకెత్తిన మెంతులు ఉపయోగాలు
మొలకెత్తిన మెంతులు సూపర్ ఫుడ్‌గా ఎలా మారాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొలకెత్తిన మెంతుల్లో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి వీటిలో నిండుగా ఉంటాయి. అలాగే కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ వంటివి కూడా లభిస్తాయి. మొలకెత్తిన మెంతులను క్రమం తప్పకుండా తింటే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం సులభంగా మారుతుంది. సలాడ్లు వంటివి తినేటప్పుడు గుప్పెడు మొలకెత్తిన మెంతులను కూడా కలుపుకొని తినండి.