ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పుష్ప 2(pushpa 2)అన్ని హంగులని హద్దుకొని డిసెంబర్ 6 న విడుదలకి సిద్ధం కాబోతుంది.పుష్ప మొదటి భాగాన్ని మించి రెండవ భాగాన్ని సక్సెస్ చెయ్యడానికి దర్శకుడు సుకుమార్(sukumar)రేయింపగళ్ళు కృషి చేస్తున్నారు.ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్(devi sriprasad) సంగీతంలో వచ్చిన రెండు పాటలు సూపర్ డూపర్ సక్సెస్ అవ్వగా రష్మిక, అనసూయ,ఫాహద్ ఫాజిల్,సునీల్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు 

పుష్ప 2  నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)అధినేతలు నవీన్,రవి శంకర్ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.ఈ మీడియా సమావేశానికి తెలుగు రాష్ట్రాల పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఇతర భాషల డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొంటున్నారు. అదే విధంగా తెలుగుతో పాటు తమిళ,కన్నడ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటి దాకా పాన్ ఇండియా సినిమాకి సంబంధించిన మీడియా మీటింగ్స్ అంటే చెన్నై,ముంబై. కేరళ, బెంగుళూర్, కేరళ వెళ్లి ప్రమోషన్స్ ని నిర్వహించే వాళ్ళు. కానీ ఫస్ట్ టైం పుష్ప 2 కోసం జాతీయ మీడియా హైదరాబాద్ లో పాల్గొంటుంది.

 

ఇందులో మూవీకి సంబంధించిన పలు విషయాలని నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, సుకుమార్ లు పాల్గొనడం లేదు. పుష్ప 2  విడుదల సమయం దగ్గర పడటంతో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here