Cyclone Dana: పెను తుపాను దాన ను ఎదుర్కోవడానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ రాత్రి ఒడిశా, బెంగాల్ ల మధ్య తుపాను తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 120 కిమీల వేగంతో పెను గాలులు వీస్తాయి. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఒడిశాలో 20 బృందాలను, పశ్చిమ బెంగాల్లో 17 బృందాలను మోహరించింది.