Cyclone Dana : వాయువ్య బంగాళాఖాతంలో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున పూరీ- సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.