ఎమ్మార్వోపై బూతులతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఈ ఘటన మహబూబాబాద్ నెల్లికుదురు మండలం చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న స్థానిక ఎమ్మార్వో రాజు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ దిగిన ఇసుక మాఫియా.. బెదిరింపులకు దిగారు. అధికార పార్టీ అని చెప్పబోయారు. అయితే పక్కనే ఉన్న వ్యక్తులు అవన్నీ ఎందుకని వారించారు. అయినప్పటికీ వినకుండా ఎమ్మార్వోని అలాగే తిట్టారు. దీనిపై పోలీసులకు ఎమ్మార్వో రాజు ఫిర్యాదు చేశారు.