రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ ఉంది. అందులో పని చేసే కానిస్టేబుళ్ళ భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 40 మంది కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు ఆకస్మాత్తుగా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. డ్యూటీ పేరిట కూలీ పనులు, చెత్త ఏరడం, మట్టి పనులు చెపిస్తున్నారని ఆరోపించారు.