ఏపీ, తెలంగాణల్లో మొత్తం 23 పోస్టులు..
ఎగ్జిక్యూటివ్ ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్) ఉద్యోగం చేస్తున్నవారు, అలాగే ఏదైనా గ్రాడ్యూషన్ (రెగ్యూలర్, డిస్టెన్స్) అర్హత కలిగిన రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ఈ అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసే అభ్యర్థికి విజిలెన్స్, ఇతర ప్రవర్తనకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉండకూడదు.