పుష్ప 2 గురించి
ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల ఊహాగానాలు వినిపించగా, దీనిపై గురువారం పూర్తి స్పష్టత వచ్చింది. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, ధనుంజయ, సునీల్, రావు రమేష్, అజయ్ తదితరులు నటిస్తున్నారు. మొదటి సినిమాలో సమంత రూత్ ప్రభు నటించిన ఊ అంటావా, మావా పాట మాదిరిగానే సీక్వెల్ లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని, దీనికి నటిని ఇంకా ఫైనల్ చేయలేదని సమాచారం.