‘సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు.. పలు సంస్థలకు, ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తోంది. 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా.. మిగిలినవి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు (33 శాతం) రూ.796 కోట్లను కార్మికులకు బోనస్‌గా ప్రకటిస్తున్నాం’ అని దసరా బోనస్ ప్రకటించిన సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.