కొద్దిరోజులుగా ప్రచారం జరుగున్నట్టుగానే ‘పుష్ప-2’ విడుదల తేదీ మారింది. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ముందుకు జరిగింది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. (Pushpa 2 The Rule On Dec 5th)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప-1’ మూవీ 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప-2’ రూపొందుతోంది. నిజానికి ఈ చిత్రం, ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 6 కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ మారింది. అయితే ఈసారి ఒకరోజు ముందుకు జరగడం విశేషం. డిసెంబర్ 5న పుష్ప-2 ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ తో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టొచ్చన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 4న ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి.