ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా (38: 46 బంతుల్లో 3×4, 2×6) కాసేపు నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ (18 నాటౌట్: 21 బంతుల్లో 2×4, 1×6) నుంచి సపోర్ట్ లభించింది. కానీ.. కివీస్ బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి భారత్కి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. అక్షదీప్ (6), జస్ప్రీత్ బుమ్రా (0) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 7 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.