పోలీసులకు జరిగిన విషయం మొత్తం వివరించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భిణిగా నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఖాదర్బాషాపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. బాలిక పక్కింట్లో ఉన్నవారి సహకారంతోనే నిందితుడు ఈ పని చేశాడని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసును మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడికి బదిలీ చేశారు. ఆయన కేసును విచారిస్తున్నారు.
Home Andhra Pradesh ప్రేమ పేరుతో మోసం..! మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు, పోక్సో కేసు నమోదు-pocso case...