లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ రావడంతో, రెండు వారాలుగా చంచల్ గూడ జైలులో ఉన్న జానీ నేడు విడుదలయ్యాడు. అయితే జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన మెడలో ఎర్రగా కండువా ఉండటం విశేషం.

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎన్నికలకు ముందు జానీ మాస్టర్ కీలక బాధ్యతలు నిర్వహించాడు. అయితే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. వెంటనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయిన్నప్పటికీ ఇప్పుడు జానీ ఎర్రగా కండువాతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎర్రగా కండువా ఉపయోగిస్తారు. జనసైనికులు కూడా దానిని పార్టీ కండువా అన్నట్టుగానే భావిస్తారు. అలాంటిది పార్టీ సస్పెండ్ చేసినా, జైలు నుంచి వస్తూనే జానీ మాస్టర్ ఎర్ర కండువాతో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here