(2 / 5)
Yashaswi Jaiswal: పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ప్రస్తుత కేలండర్ ఇయర్లో 1000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు. 2024లో ఇప్పటివరకు 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్ ఆడి 59.23 సగటుతో 1007 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో యశస్వి రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్ 214 నాటౌట్.