దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి(nitesh tiwari)దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ(ramayana)తో సాయిపల్లవి(sai pallavi)బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం అందరకి తెలిసిందే.ఇందులో సీతమ్మ తల్లి పాత్రలో సాయి పల్లవి చేస్తుండగా రాముడుగా రణబీర్ కపూర్(ranbir kapoor)కనిపించనున్నాడు.కేజిఎఫ్ యష్(yash)రావణుడుగా చేస్తుండంతో పాటుగా వన్ ఆఫ్ ది నిర్మాతగా కూడా వ్యహరిస్తున్నాడు. ఇంతవరకు భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కని హై టెక్నీకల్ వాల్యూస్ తో చిత్రం తెరకెక్కుతుంది. 

రీసెంట్ గా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బాలీవుడ్ కి చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాకు ఫోన్ చేసాడు.నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి,తరచు వార్తల్లో నిలబడటానికి పిఆర్ టీం ని నియమించుకుంటారా అని అడిగాడు.అలా చేస్తే నేను లైమ్ లైట్ లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అనిపించింది.ఎందుకంటే తరచూ నా గురించి మాట్లాడుకోవాలన్నా కూడా ప్రేక్షకులకి విసుగు వస్తుంది. అందుకే అలాంటివి అవసరం లేదని చెప్పానని వెల్లడించింది.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  

ఇక సాయి పల్లవి అప్ కమింగ్ మూవీ అమరన్ ఈ నెల 31 న విడుదల కాబోతుంది.దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్(major mukund varadarajan)బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌(indhu rebecca varghese)పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. షూట్ కి వెళ్లే ముందు  ఇందు ని కలిసి స్వయంగా ఎన్నో విషయాల మీద చర్చలు కూడా జరిపింది. వరద రాజన్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించబోతున్నాడు.ట్రైలర్ బాగుండటంతో మూవీ మీద అందరిలో భారీ అంచనాలే  ఉన్నాయి.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here