పిక్నిక్ కు వెళ్తే..
గుర్హ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రసిద్ధ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ సమీపంలో తనకు, తన భర్తకు మధ్య గొడవ జరిగిందని మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.ఆ తరువాత, తన భర్త కళ్లముందే ఫౌంటెన్ సమీపంలో ఐదుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, వారిలో ఒకరి చేతిపై, ఛాతీపై పచ్చబొట్లు ఉన్నాయని బాధితురాలు తెలిపింది. దీనిపై వారిద్దరూ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గుర్హ్ తహసీల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దాంతో పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి 7 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫొరెన్సిక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది.