Medak Medical College: మెదక్ పట్టణంలోని పిల్లి కొట్యాల్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. త్వరలో రాష్ట్రంలో నూతనంగా 5 క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు . ప్రస్తుత కాలంలో డయాబెటిస్, క్యాన్సర్, బిపి, గుండె సంబంధిత వ్యాధులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. కావున వీటిపై గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్యాన్సర్ కోసం ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.