మత స్వేచ్ఛ
లింగ సమస్యలతో పాటు, విద్యలో మత స్వేచ్ఛకు తన నిబద్ధతను ట్రంప్ పునరుద్ఘాటించారు.తను అధికారంలోకి వస్తే ‘‘అమెరికన్లు మళ్లీ ‘మెర్రీ క్రిస్మస్’ అని సగర్వంగా చెబుతారు’’ అని తన గత ప్రచార నినాదాన్ని మరోసారి గుర్తు చేశారు. నేరాలు, గర్భస్రావం, సంప్రదాయ విలువల రక్షణ వంటి కీలక అంశాలను ట్రంప్ (donald trump) తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కన్జర్వేటివ్ ఓటర్లను సమీకరించడమే ట్రంప్ ప్రచార వ్యూహంగా కనిపిస్తోంది.