మూడున్నర దశాబ్దాలుగా తనదైన నటనతో అశేష ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున(nagarjuna)నటనకి సంబంధించి ఎన్ని రకాల పాత్రలు ఉంటాయో వాటన్నింటిలోను తన సత్తా చాటి కొన్ని లక్షల మంది అభిమానులని కూడా సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం కుబేర, కూలీ వంటి సినిమాల్లో భిన్నమైన క్యారక్టర్స్ లో చేస్తున్నాడు.    

రీసెంట్ గా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా ‘మా నాన్న ఏఎన్ఆర్(anr)గారి శతజయంతి వేడుకలను జరుపుకుంటున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం.ఈ మైలురాయికి గుర్తుగా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)చిరంజీవి(chiranjeevi)ఏఎన్ఆర్ అవార్డ్స్ 2024కి రండి. ఈ అవార్డు ఫంక్షన్‌ను మరిచిపోలేనిదిగా చేద్దాం. ఆ ఇద్దరిని ఆహ్వానిస్తున్నందుకు చాలా గౌరవంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఏఎన్ ఆర్ అవార్డ్స్(anr awards)ని నాగార్జున ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాడు.సినిమా రంగంలో విశేష కీర్తిని గడించిన ప్రముఖులకి ఆ అవార్డుని అందించి సత్కరిస్తాడు.ఆ అవార్డుని అందుకోవడాన్ని ఆయా నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.ఈ సంవత్సరం చిరంజీవి అందుకోనున్నారు.చిరంజీవి ని నాగార్జున అన్నయ్య అని సంబోధిస్తాడనే విషయం తెలిసిందే. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here