‘పటాస్‌’తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనిల్‌ రావిపూడి తన సినిమాలతో మ్యాజిక్‌ చేస్తూ ఆడియన్స్‌కి అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్లలో తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న అనిల్‌ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌(Victory Venkatesh)తో ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunnam) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయబోతున్నారు. వెంకటేష్‌తో ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాలు చేసిన అనిల్‌ ఈ సంక్రాంతికి ఆడియన్స్‌ని ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఇదిలా ఉంటే.. అనిల్‌ రావిపూడి(Anil Ravipudi)కి రూ.130 కోట్ల విలువైన కారు బహుమతిగా అందింది. నందమూరి బాలకృష్ణ హీరోగా షైన్‌ స్క్రీన్‌ పతాకంపై ‘భగవంత్‌ కేసరి’(Bhagavanth Kesari) చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి ఈ గిఫ్ట్‌ని అందించారు. టొయోటా బ్రాండ్‌లో వెల్‌ఫైర్‌ మోడల్‌ కారును అనిల్‌కి అందించారు. ‘భగవంత్‌ కేసరి’ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించే సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే తమ బేనర్‌లో విశ్వక్‌సేన్‌ హీరోగా ‘లైలా’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాదు, బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా కౌశిక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం కూడా నిర్మాణంలో ఉంది. మైథలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తోనే సాహు గారపాటి చేస్తున్నారు. వీటి తర్వాత అనిల్‌ రావిపూడితో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ‘భగవంత్‌ కేసరి’ తర్వాత నందమూరి బాలకృష్ణతో అనిల్‌ రావిపూడి ఒక సినిమా చేస్తానని చెప్పారు. ఆ సినిమా ఈ బేనర్‌లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here