ఐసీఐసీఐ బ్యాంక్ ఆదాయం ఎంత?
ఈ క్యూ2 ఫలితాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 18.82 శాతం లాభంతో రూ.12,947.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. ఈ క్యూ2 లో ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీపై ఆదాయం రూ .46,325.78 కోట్లుగా ఉంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వచ్చిన వడ్డీ ఆదాయం రూ .38,938.08 కోట్లతో పోలిస్తే.. 18.97% అధికం లేదా రూ .7,387.7 కోట్లు ఎక్కువ. అలాగే, పెట్టుబడులపై ఆదాయం రూ.9,279.96 కోట్లతో పోలిస్తే 28.55 శాతం (రూ.2,649.97 కోట్లు) పెరిగి రూ.11,929.93 కోట్లకు చేరింది.