TG Govt Megha Pact : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.