నందమూరి బాలకృష్ణ(balakrishna)హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్‍స్టాపబుల్ షో ఎంతగా విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే, ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా నిలబడింది.రీసెంట్ గా 4వ సీజన్ స్టార్ట్ అవ్వగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు(chandrababu naidu)మొదటి  గెస్ట్ గా వచ్చారు.

 ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో  బాలకృష్ణ మాట్లాడుతు తీరిక సమయాల్లో ఎలాంటి చిత్రాలు చూసేందుకు ఇష్టపడతారు.మా చెల్లెలితో కలిసి చూసిన రొమాంటిక్ సినిమా ఒకటి చెప్పండని  ఒక ఫొటో చూపించాడు.నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి.ఒక్కోసారి టైమ్ తక్కువగా ఉన్నప్పుడు నా భార్యతో కలిసి కూర్చొని నవ్వుతూ నువ్వు నటించిన రొమాంటిక్ సినిమాలు అప్పుడప్పుడు చూస్తాను.

బాలకృష్ణ  దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారు.చంద్రబాబు నాయుడు దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారు. డిఫరెన్స్ ఉంటుంది.నీ సినిమాలు చూస్తే రిలాక్సియేషన్‍గా ఉండటంతో పాటు ఫ్యామిలీ మెంబర్‌ను సపోర్ట్ చేసినట్టు కూాడా అవుతుంది.కాబట్టి  రెండు పనులు అవుతాయి అని చెప్పుకొచ్చారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here