వచ్చే నాలుగు సంవత్సరాలలో తెలంగాణలో అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మిస్తామన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే ఈ ప్రభుత్వ ఆశయమన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామన్నారు. అర్హుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు తావు లేకుండా ప్రక్రియను చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని భావిస్తోంది. ఈ స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.