సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా 14 రిమాండ్ విధించారు. హత్య జరిగిన రోజున్నే నిందితుడు బత్తిని సంతోష్ గౌడ్ పోలీసులకు లొంగిపోయాడు. మూడు రోజులపాటు విచారించిన పోలీసులు…గంగారెడ్డి హత్యకు భూ వివాదం, పాత కక్షలే ప్రధాన కారణమని తేల్చారు. హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటించారు.