విమర్శలు
సాయిపల్లవికి సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెను విమర్శిస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు. భారత్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ ఒకటేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైనికులు అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి అమాయకులైన భారతీయులపై దాడులు చేస్తున్నారని, భారత ఆర్మీ ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని అంటున్నారు. ఇండియా, పాకిస్థాన్ ఆర్మీలను ఒకటే అనేలా పోల్చడం తగదని సాయి పల్లవిని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల వల్లే భారత్లో ఉగ్రదాడులు జరిగాయని, భారత్ వల్ల పాక్లో ఏ ఉగ్రదాడులు జరగలేదని గుర్తు చేస్తున్నారు.