ముఖ్య తేదీలు:
అక్టోబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలి. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్ పూర్తి చేస్తారు.నవంబర్ 20వ తేదీలో పు ఎంపిక జాబితా విడుదలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ప్రభుత్వ పారామెడికల్ సంస్థల్లో మొత్తం 3,122 సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా పారామెడికల్ కోర్సుల్లో కూడా సీట్లు అందుబాటులో ఉంటాయి.