ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రెండు రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నాయి. ఇక దానా తుఫాను కారణంగా 15 రైళ్ల రద్దయ్యాయి. మరోవైపు కిరండూల్-విశాఖపట్నం (08552) రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులోకి రానుంది.