నందమూరి బాలకృష్ణ(balakrishna)హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్‍స్టాపబుల్ షో(unstoppable)ఎంతగా విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే, ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా నిలబడింది.రీసెంట్ గా 4వ సీజన్ స్టార్ట్ అవ్వగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు(nara chandrababu naidu)మొదటి  గెస్ట్ గా వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తో  బాలకృష్ణ(balakrishna)మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)తిరుపతి లడ్డు(tirupati laddu) విషయంలో జరిగిన అపచారానికి ప్రాయచ్చిత్తంగా  సనాతన దర్మం కోసం దీక్ష చేపట్టారు కదా,దీనిపై మీ ఉద్దేశ్యం ఏంటని అడిగాడు. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ ఎవరి నమ్మకాలూ వారికి ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిగా అందరి నమ్మకాలూ కాపాడే బాధ్యత నాపై ఉంటుంది.ఎక్కడా ఎలాంటి అపచారం జరగకుండా ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, పరిపాలన సాగించడం నా బాధ్యత. 

ఎన్నికల ముందు నేను జైలులో ఉన్నప్పుడు కలిసాడు.రెండు నిమిషాలు ఇద్దరం మాట్లాడుకున్నాం. ధైర్యంగానే ఉన్నారా అని అడిగితే  నా జీవితంలో అధైర్యం ఉండదు, భయపడను అని చెప్పా. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు చూశాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా కలిసి పోటీ చేద్దామని అన్నాను.ఆయన కూడా ఆలోచించి ఓకే చెప్పాడు.బీజేపీ(bjp)కి  కూడా నచ్చజెప్పి కూటమికి తీసుకొస్తానని చెప్పడంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించామని చెప్పాడు.


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here