5 ఏళ్లు గాడిదలు కాశారా?
“మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్. బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా?” – వైఎస్ షర్మిల