ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులను ఆదేశించింది. అయితే డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులు క్యాట్, హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ రెండు చోట్ల వీరికి ఊరట దక్కలేదు. దీంతో ఏపీ, తెలంగాణ సీఎస్ లు ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటీవల రిలీవ్ అయ్యారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఐఏఎస్ లు సృజన, హరికిరణ్, శివశంకర్ ను ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ లకు ఏపీ సర్కార్ తాజాగా పోస్టింగ్ లు కేటాయించింది.
Home Andhra Pradesh తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ లకు పోస్టింగ్ లు, ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి-ias officers...