ఇలా చేస్తే బెటర్..
పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లను అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం.. పాఠశాల హెచ్‌ఎం యూడైస్‌లో మార్చొచ్చు. విద్యార్థి పేరును మాత్రం ఎమ్మార్సీవారు మార్చాలి. ఆధార్‌లోని వివరాలు ఆధార్ సెంటర్‌లోనే మార్చాలి. స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం హెచ్‌ఎం సర్టిఫికెట్ ఇస్తే.. ఈ వివరాల ప్రకారం ఆధార్ కేంద్రాల్లో మార్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అప్పుడు ప్రక్రియ సులభతరం అవుతుంది. ఆధార్ వివరాల సవరణ బాధ్యత హెచ్‌ఎంలకు అప్పగించినా.. ఆపార్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.