ఈ దీపావళికి పలు సినిమా అప్డేట్ లు రాబోతున్నాయి. ముఖ్యంగా మెగా, నందమూరి అభిమానులకు ఇది అసలుసిసలైన సినిమా పండుగలా మారబోతుంది.

దీపావళికి మెగా అభిమానులకు రెండు సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. ఒకటి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి టీజర్ విడుదలవుతుండగా (Game Changer Teaser), మరొకటి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సింగిల్ (Hari Hara Veera Mallu First Single) విడుదల కాబోతోంది.

ఇక నందమూరి అభిమానులను బాలకృష్ణ ఖుషి చేయబోతున్నారు. ఆయన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేసున్నారు. ఈ మూవీ టైటిల్ టీజర్ (NBK 109 Title Teaser) దీపావళికి విడుదల కానుంది.

వీటితో పాటు ఇతర హీరోల సినిమాల అప్డేట్లు సైతం ఈ దీపావళి ఫుల్ గా రాబోతున్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here