- ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి
- ఆ తర్వాత చికెన్ ముక్కలపై శనగ పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి.
- పదార్థాలు బాగా మిక్స్ అయిన ఆ మిశ్రమానికి నిమ్మరసం వేసి కలిపితే మెత్తగా మారుతుంది. ఒకవేళ నిమ్మరసం తర్వాత కూడా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలియతిప్పాలి.
- చికెన్ ముక్కలకి ఆ మిశ్రమం బాగా కలిసిన తర్వాత కనీసం 15-20 నిమిషాలు అలానే పక్కన పెట్టేయాలి.
- ఆ తర్వాత స్టౌ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి
- నూనె బాగా వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డ్ రంగులోకి మారే వరకు వేయించాలి.
- ఆ తర్వాత ఆఖరిగా కొంచెం కరివేపాకు వేసి వాటికి కూడా కారం పట్టేవరకు వేయించి చికెన్ ముక్కలతో కలిపి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఆ వేడి వేడి చికెన్ పకోడి ముక్కలపై మళ్లీ నిమ్మరసం పిండి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే ఆ మజానే వేరు. ఇంకెందుకు ఆలస్యం ఈరోజే కరకరలాడే చికెన్ పకోడిని మీ ఇంట్లో ట్రై చేయండి