నిప్పట్టు తయారీ విధానం
- స్టౌ వెలిగించి కడాయిలో తొలుత 1 1/2 కప్పు నీరు పోయాలి
- నీరు వేడి అయ్యేలోపు.. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్రని మిక్సీలో వేసుకుని పేస్ట్‌గా చేసుకోవాలి
- వేడి అయిన నీటిలో తగినంత ఉప్పు వేయాలి
- ఆ తర్వాత మిక్సీలో కొట్టిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్‌ని ఆ నీటిలో వేయాలి
- నిమిషం ఆగిన తర్వాత అప్పటికే కనీసం అరగంట నానబెట్టిన శనగ పప్పుని కూడా వేయాలి
- ఆ తర్వాత వెన్న కూడా వేసి బాగా కలపాలి
- చివర్లో చిన్నగా కట్ చేసిన కరివేపాతో పాటు కారంపొడిని వేసి బాగా కలియతిప్పాలి.
- కనీసం ఓ 2 నిమిషాలు ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత బియ్యం పిండిని వేయాలి
- పిండిని వేసిన వెంటనే స్టౌ ఆఫ్ చేసి.. కడాయిని దించేయాలి
- ఆ తర్వాత పిండిని గరిటెతో బాగా మిక్స్ చేసి.. ఓ 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి
- వేడి తగ్గిన తర్వాత చల్లని నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని చపాతీ పిండి ముద్ద తరహాలో పెద్దదిగా కలుపుకోవాలి
- ఆ తర్వాత ఆ పెద్ద ముద్ద నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండల్లా చేసుకోవాలి
- ఆ ఉండల్ని నిప్పట్టు షేప్ తీసుకురావడానికి ఉండ కింద, పైభాగాన కవర్ ఉంచి ఒక మీడియం సైజ్ స్టీల్ బాక్స్‌తో ఆ ఉండని ఒత్తాలి. కవర్ లేకపోతే స్టీల్ బాక్స్‌కి పిండి అతుక్కుపోతుంది.
- ఇలా అన్ని ఉండల్ని ఒత్తుకున్న తర్వాత మళ్లీ స్టౌ వెలిగించి కడాయి పెట్టుకుని నిప్పట్టుని వేయించేందుకు తగినంత నూనె పోయాలి
- నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కోక్కటికి అందులో నిప్పట్టు వేయాలి. మీ కడాయి పరిమాణాన్ని బట్టి ఓ 4-5 వరకు ఏకకాలంలో వేయించొచ్చు
- కానీ.. నూనెలో వేసిన ఒక నిమిషం వరకు ఆ నిప్పట్టుని కదపకూడదు. ఒకవేళ కదిపితే అవి విరిగిపోయే ప్రమాదం ఉంది.
- ఒక నిమిషం తర్వాత అటు ఇటు కదుపుతూ వేయించాలి
- ఆ తర్వాత నిప్పట్టుని తిప్పి రెండో వైపు కూడా వేయించాలి
- నిప్పట్టు గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించి.. ఆ తర్వాత నూనెలో నుంచి తీసేసి ప్లేట్‌లో వేసుకోవాలి
సాయంత్రం వేళలలో కరకరలాడే నిప్పట్టు తింటే ఆ రుచే వేరు.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే నిప్పట్టుని మీ ఇంట్లో తయారు చేసుకోండి.