భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ఇక ఆరు టెస్టులను ఆడనుంది. ఇందులో న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియాతో ఐదు ఉన్నాయి. మిగిలిన జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ జట్టు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించాలంటే.. ఈ ఆరు టెస్టుల్లో కనీసం 4 మ్యాచ్‌ల్లో గెలవాలి.