సినీ సెలెబ్రిటీలు వీరే.. మూడు చిత్రాల కోసం..
అమరన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు బిగ్‍బాస్‍కు వచ్చారు తమిళ హీరో శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా గెస్టుగా పాల్గొన్నారు. లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఈ ఎపిసోడ్‍కు హాజరయ్యారు. ‘క’ సినిమా ప్రమోషన్ కోసం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్లు తన్విరామ్, నయన్ సారిక వచ్చారు. ఈ మూడు చిత్రాలు దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.