వ్యాపారి రమేష్ హత్యకు అతని భార్య నీహారిక, అమె ప్రియుడు డాక్టర్ నిఖిల్ కారణమని పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని కాఫీ తోటల్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు.. దర్యాప్తులో కీలక విషయాలను తెలుసుకున్నారు. వ్యాపారవేత్త రమేష్‌ది హైదరాబాద్. భార్య నిహారికది యాదాద్రి జిల్లా. నిహారిక ప్రియుడు నిఖిల్‌ది కడప జిల్లా అని పోలీసులు చెబుతున్నారు.