కంగువ గురించి..
ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కంగువ నవంబర్ 14వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సూర్య డ్యుయల్ రోల్ చేశారు. దిశా పటానీ, బాబీ డియోల్, జగపతి బాబు, యోగిబాబు, నటరాజన్ సుబ్రమణియం, రెడిన్ కింగ్‍స్లే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. కంగువ భారీ బ్లాక్‍బస్టర్ సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉంది టీమ్. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి.