వృశ్చికం
దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ, ఇష్టమైన వ్యక్తులతో అభిప్రాయ బేధాలు, ఘర్షణలు రాకుండా జాగ్రత్త వహించాలి. సంఘాల్లో వ్యాపార రంగంలో అనుభవం ఉన్న నూతన వ్యక్తుల పరిచయాలు, భాగస్వామికి సంబం ధించిన వృత్తిపరమైన విషయాలలో, ఆదాయ అంశాలలో ఆకస్మిక మార్పులు. వివాహ సంబంధమైన అంశాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. పనుల పట్ల అసంతృప్తి ఆటంకాలు. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు అధిక శ్రమ. తండ్రితో చర్చించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం కొంతవరకు మంచిది. వృత్తి పరమైన విషయాలలో కొంత నిరాశక్తత, అధిక శ్రమ. క్రింద పనిచేసే వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు.