ధన త్రయోదశి రోజు సాయంత్రం యమ దీపం వెలిగిస్తారు. దీని వల్ల అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు. దీనితో పాటు ఈరోజు ఆహార ధాన్యాలు, బట్టలు, చీపురు, పంచదార, బియ్యం, ఖీర్, తెల్లని వస్త్రాలు వంటి కొన్ని వస్తువులను దానం చేయడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ధన త్రయోదశి రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం.