అయితే, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేసినప్పటికీ, ఇన్స్టాగ్రామ్ మీ అకౌంట్‌ని వెంటనే డిలీట్ చేయదు. ఇందుకోసం 30 రోజుల సమయం పడుతుంది. ఈలోపు మీ అకౌంట్ తాత్కాలికంగా డీయాక్టివేట్ అవుతుంది. ఈ 30 రోజుల కాలంలో మీర సైన్-ఇన్ అవ్వకపోతే ఆ తర్వాత శాశ్వతంగా అకౌంట్ డిలీట్ అయిపోతుంది.