(2 / 8)
మేషరాశి : నవంబర్ 6న శుక్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నందున మేష రాశివారి మాటలకు ప్రతిచోటా విలువ ఉంటుంది. వైవాహిక జీవితంలోని అనవసర సమస్యలు సులభంగా తొలగిపోతాయి. మీరు ఆర్థిక విషయాలలో మంచి రాబడిని పొందుతారు. మీ పనిలో అందరి సహాయ, సహకారాలు మీకు లభిస్తాయి. కుటుంబానికి చెందిన ఆస్తిలో న్యాయమైన వాటాను పొందుతారు. మీ ఆదాయం నిరాడంబరంగా ఉన్నప్పటికీ, మీరు తెలివిగా డబ్బు ఆదా చేస్తారు. అనవసరమైన తగాదాలు, వాదనలకు తావివ్వకుండా ప్రశాంతంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. మహిళల పని తీరు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. సంగీతం, నృత్యం, రచనలలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.