వంట నూనెల ధరలు పెరగడానికి కారణాలు..

సెప్టెంబర్​లో రీటైల్​ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠ (5.5శాతం) స్థాయికి చేరుకోవడంతో వంట నూనె ధరలు కూడా పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు, కూరగాయ ధరలు వృద్ధిచెందడం ఇందుకు ఒక కారణం. పైగా గత నెలలో పామ్​, సాయ్​బీన్​, సన్​ఫ్లవర్​ నూనెల దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచడం కూడా వంట నూనెల ధరలను అమాంతం పెంచేశాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్​లలో కూడా ధరలు వృద్ధిచెందడం మరింత ప్రతికూలంగా మారింది. అంత్జాతీయంగా క్రూడ్​ పామ్​, సాయ్​బీమ్​, సన్​ఫ్లవర్​ ఆయిల్​ ధర సుమారు 10.6శాతం, 16.8శాతం, 12.3శాతం వృద్ధిచెందాయి. సన్​ఫ్లవర్​ ఆయిల్​, క్రూడ్​ సాయ్​బీన్​పై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఏకంగా 5.5శాతం నుంచి 27.5శాతానికి పెంచేసింది. రిఫైన్డ్​ ఎడిబుల్​ ఆయిల్​పై సుంకాన్ని సైతం 13.7శాతం నుంచి 35.7శాతానికి పెంచేసింది. ఇవన్నీ సెప్టెంబర్​ 14న అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి దేశంలో వంట నూనెల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here