దీని తర్వాత అక్టోబర్ 18న మళ్లీ రాశి మారి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. సంవత్సరం చివరలో తిరోగమన దశలో భాగంలో డిసెంబర్ 5న కర్కాటకరాశి నుండి మిథున రాశికి మారుతుంది. జ్ఞానం, విద్య, సంపద, ఆధ్యాత్మికత, మతతత్వానికి బాధ్యత వహించే గ్రహంగా బృహస్పతిని భావిస్తారు. బృహస్పతి మొత్తం పన్నెండు రాశులను చుట్టేసి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది. వచ్చే ఏడాది బృహస్పతి రాశి మార్పు వల్ల నాలుగు రాశుల వారికి అధిక లాభాలు, రెట్టింపు అదృష్టం కలగబోతుంది. ఏయే రాశుల వాళ్ళు ప్రయోజనాలు పొందుతారో చూద్దాం.