హైదరాబాద్ లోని NTR స్టేడియం వద్దకు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న తమని అన్యాయంగా సస్పెండ్ చేశారని బెటాలియన్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తన భార్యలు రోడ్లపైకి వస్తే.. వారికోసమే వచ్చామని మీడియాకు బదులిచ్చారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డే వంద సార్లు.. ఏక్ పోలీస్ చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మమ్మల్ని కనీసం కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.