రాజ్ పాకాల విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సోమవారం మోకిలా పీఎస్‌కు హాజరు కాకపోతే బీఎన్ఎస్ 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. పార్టీని అరెంజ్ చేసిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ పాకాల, విజయ్ మద్దూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.