నెల్లూరు హైవేలో వెళ్తుండగా పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కారు ఆపి, గాయపడిన వ్యక్తిని పరిశీలించారు. వెంటనే క్షతగాత్రుడికి మెడికల్ సపోర్టు ఇప్పించి ఆసుపత్రికి తరలించారు. సరైన వైద్యం అందజేసేలా చేశారు. అయితే ఇంటికి త్వరగా వెళ్లాలనే క్రమంలో దయచేసి వేగంగా వాహనాలు నడపవద్దని జానీ మాస్టర్ కోరారు.